మదిని మీటిన వర్షం-పార్ట్-9

- December 24, 2015 , by Maagulf

నందుకి తాళి పూజ చేయమని చెప్పారు, మళ్లీ నా నోటి దూల స్టార్ట్ “ఏంటండి పంతులు గారు పక్కన మొగుడున్నాడు కదా.. వాడు బాగుండాలని వాడికే పూజ చేస్తే అయిపోతుంది తాళికి ఎందుకు" అని అన్న "తాళిలో బంగారం ఉంటుంది నాయన మొగుడిలో కాదు అందుకే ఆడాళ్ళు మొగుడు కంటే తాళికే ఎక్కువ విలువ ఇస్తారు” అని గట్టి సమాధానమే ఇచ్చాడు…. అభి చేత నందుకి సింధూరం పెట్టించారు… అభి కండువాకి నందు కొంగుకి ముడి వేసి అగ్ని హోత్రం చుట్టూ సప్తపది చేయమన్నారు … అగ్ని సాక్షిగా ఒకరికి ఒకరు ప్రేమ ఆప్యాయతలతో అర్థం చూసుకుంటూ అండగా నిలుస్తు జీవితాంతం తోడు ఉంటాము అని ప్రమాణం చేసుకుంటున్నారు. నాతో పక్కన ఉన్న ఒక రాయి తెప్పించి మధ్యలో పెట్టారు దాని పైన నందు కాలు పెట్టింది మగాడు ఎక్కువ ఆడది తక్కువ అనే భావన పోగొట్టేందుకు అభి నందు పాదాలకు మెట్టెలు పెట్టాడు … బిందెడు పాలు తీసుకొచ్చి జంట ముందు పెట్టాను ఇక మా జోష్ ఎక్కువ అయింది అటు సైడ్ వర్ష లారక్క ఇటు నేను అనిల్ గాడు చుట్టూ పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు … ఉంగరం పాలలో వేయగానే అటు నందుకి ఇటు అభికి మేము సపోర్ట్ చేస్తూ అరుస్తున్నం ఇంతలో లారక్క నందు చెవిలో ఏమో చెప్పింది అంతే మా వాడు గట్టిగ అరిచి చేయి బయటకు తీసాడు బాగా గిల్లి గోరు ముద్ర వేసింది .. ఎక్కడ తగ్గకుండా చేయి పెట్టాడు ఇప్పుడు నేను చెవిలో చెప్పను నందు మెలికలు తిరుగుతూ, నవ్వుతు, సిగ్గు పడుతూ చేయి బయటకు తీసింది …. మొత్తానికి అభి గాడు ఉంగరం తీసి గెలిచాడు ఆనందంతో మేము అరిచాము…. రెండో సారి చేయి లోపల పెట్టె ముందు నందు చెవిలో వర్ష ఏదో చెప్పింది దానికి నందు అభి గాడిని ఒక రొమాంటిక్ కోపం కూడిన లుక్ ఇచ్చి కన్ను కొట్టింది అంతే మనోడి నోటినుండి లాలాపాతం మొదలైంది... వెతకడం మానేసాడు ఈసారి నందు గెలిచింది బేలగా మా వైపు చూసాడు తు ఎదవ అని ఉమ్మేసి "ఈ సారి పరువు తీస్తే చంపేస్తాం అని తిట్టి" బాగా రెచ్చగోట్టాము … మళ్లీ కన్ను కొట్టింది ఈసారి మా వాడు పడిపోలేదు నేను కాలర్ తో పాటు కళ్ళు ఎగరేసాను వర్ష ని చూస్తూ … ఇద్దరు ఎంత వెతికినా ఉంగరం దొరకడం లేదు … "ఏంటి ఒకరిని ఒకరు గెలిపించుకోవాలని ఉంగరం తీయడం లేదా " అని ఒకే సారి అన్నాము నేను వర్ష .. "లేదురా నిజంగా దొరకడం లేదు" అన్నారు ఇద్దరు తల అడ్డంగా ఊపుతూ .... "అబద్దాలు చెప్తారా" అని నేను వర్ష పాలలో చేయి పెట్టి వెతికుతున్నాం మా వాళ్ళని గెలిపించుకోవాలనే తపనతో …. పాలలో ఒకరి చేతులు ఒకరు తోసుకుంటూ ఉంగరం వెతుకుతున్నాం ఇంతలో పంతులు గారు "నాయన మీకు ఇంకా టైం ఉంది ఈసారి పెళ్లి జంటకి ఆ ఛాన్స్ ఇవ్వండి అసలు నేను దాంట్లో ఉంగరం వెయ్యనే లేదు" అని తన చేతిలో దాపెట్టిన ఉంగరం బయటకు తీస్తూ … అప్పుడు అర్థం అయింది మేము ఎంత మునిగి పోయాము ఆటలో అని నేను నాలిక్కరుచుకున్నా.. తను సిగ్గు పడుతూ చేయి తీసి తల దించుకొని కూర్చున్నాం … మూడో సారి ఇద్దరు పట్టుకొని బయటకు తీసారు … అందరు చప్పట్లు కొడుతుంటే నేను వర్ష చూసుకుంటున్నాము చిన్న చిరునవ్వు… చుట్టూ ఏం జరుగుతోందో తెలీడం లేదు ఇద్దరం ఆకాశం మబ్బులో ఎదురెదురుగా కుర్చుని చుసుకునట్టుగా ఉంది ఇంతలో ఇద్దరినీ అదిలించి ఈ లోకంలోకి తీసుకొని వచ్చారు … అరుంధతి వశిష్ట నక్షత్ర దర్శనం కోసం బయటకు వెళ్ళడానికి సిద్దం అవుతున్నారు అంతా… మాకు మాత్రం ఏమి పట్టడం లేదు అలా సైలెంట్ కూర్చుండి పోయి ఒకరిని ఒకరం చూసుకుంటున్నాము….

అరుంధతి వశిష్ట నక్షత్ర దర్శన కోసం అందరు లేస్తున్నారు సరంజామా తీసుకోవడానికి వర్షా.. అభి గాడి పంచె సర్దడానికి నేను ఒకసారిగా ఒంగాము ఇద్దరి తలలు డిక్కీ కొట్టుకున్నాయి ఆ దెబ్బకి తల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి వెనక్కి వాలిపోయి తలా పట్టుకొని కింద కూర్చున్న అది తలా కొబ్బరి బొండమా …. ఛి ఛి అమ్మాయిలందరు నవ్వు తున్నారు అయిన మనం ఇంత వీకా … “ఎప్పుడు తిని తొంగుంటే నీకు గొడ్డుకి తేడా ఏటుంది కూసింత శరీర పోసన ఉండాలా వ్యాయామాలు గట్రా సేయాల” ఘోష వినిపించింది… తల రుద్దుకుంటూ తనని చూశా నవ్వుతోంది చిన్నగా తల అడ్డం ఊపుతూ చంపలు వాయించుకొని సారీ చెప్పింది … “రేయ్ ఒకసారి డిక్కీ కొడితే కొమ్ములు వస్తాయి అంట ఇంకో డిక్కీ కొడతావ“ అడిగింది బండది.. ఓరి నాయనో అని అక్కడినుంచి లగేత్తుకొని కిందకి వచ్చేసాను … అందరు బయటకు వెళ్ళేటప్పుడు పంతులు కూడా పిలిచి రెండు చేతులతో డిక్కీ కొట్టినట్టు చూపించి కొమ్ములు సైగ చేసాడు… వర్ష కూడా డిక్కీ అని సైగ చేసింది అక్కడి నుంచి మెల్లగా జారుకొని బయట పడ్డాను … సూర్య పూజ చేస్తున్నారు నీళ్ళ చెంబు పట్టుకొని నేను పసుపు కుంకుమ పళ్ళెం పట్టుకొని తను నిలపడ్డాము పంతులు గారు అడిగారు "బాబు అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా" అని అడిగాడు "ఈ ఎండలో సూర్యుడు కళ్ళు మంట పుట్టిస్తుంటే అరుంధతి ఎక్కడ కనిపిస్తుంది వీడికి పిచ్చి కాక పోతే" అని తెలీకుండా వాడికంటే ముందు నేను తల ఊపుతున్న … "బాబు నీ అరుంధతి నీకు కనిపిస్తోంది మాకు తెల్సు నేను అడిగేది పెళ్లి కొడుకుని" వాడు నవ్వుతు హా అని తల ఊపాడు… అమ్మ నీకు అని నందుని వర్షని చూసాడు వర్ష సిగ్గు పడుతూ ఉంటె నందు తల ఊపింది … తిరిగి మండపం లోకి వచ్చేటప్పుడు ద్వారం దగ్గర అడ్డుపడి పేర్లు చెప్పమని బలవంతం చేసాము అభి నందు అని చెప్పారు… ఇవి మాకు తెలుసమ్మా ఫోన్ లో మాట్లాడేటప్పుడు పిలుచుకున్తారే ఆ పేర్లు చెప్పండి … ఏమి లేవు ఏమి లేవు అని చెప్తున్నారు అభి గాడి మొబైల్ తీసి చూపించా మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా?? “రేయ్ పరువు తీయకురా ప్లీజ్” అయితే మీరే చెప్పండి “చిట్టి తల్లి ” అన్నాడు అభి .. నందు నేను చెప్పను అని కొంచం మొండికేసింది తరువాత అందరు బలవంత పెట్టేసరికి "చిన్ను" అనింది "అబ్బచా మాకు తెలిదు మరి లాస్ట్ ఛాన్స్ నువ్వు చెప్పక పోతే ఇక మీద వాణ్ణి అదే పేరుతో పిలుస్తాం అందరం" "వద్దు వద్దు చెప్తా అది అది పిచ్చి సన్యాసి” అనింది అంతే అందరు ఫుల్ నవ్వులు అభి గాడు షాక్ పేస్ కొంచం మాడిపోయింది… దీంతో పెళ్లి తంతు ముగిసింది … అభికి నందుకి పాలు ఇచ్చారు తాగడానికి … అందరం కలిసి టిఫిన్ చేసేకి వెళ్ళాము … ఇద్దరికీ ఒకే ప్లేట్ లో వడ్డించాము క్యారట్ హల్వా ఇడ్లీ వడ చట్ని వడ్డించారు … ఫస్ట్ అభి తినపోతుంటే “రేయ్ తిండిపోతు సుబ్బన్న ఫస్ట్ మా చెల్లికి తినిపించార ఎదవ.. మొత్తం నువ్వే తినేటట్టు ఉన్నావు ... " అని కసురుకున్న తను ఫస్ట్ నందుకి తినిపించాడు తరువాత నందు తనకి తినిపించింది . నేను వర్షని చూడటం మానేసి మేసేస్తున్న (ఆకలి కి అమ్మాయి గుర్తు రాదు కదా..) వెనక అనిల్ గాడు కొమ్ములు పెట్టి అందరికి సైగ చేసి చూపించాడు వర్ష ఒక ఫోటో కూడా తీసుకుంది ... "మేస్తున్న దున్నపోతు" అనే బిరుదు కూడా పెట్టేసారు ... అభిగాడు లారక్కని వర్షని అనిల్ ని రాజు ని పిలిచి ఏదో చెప్పాడు ... తిండి ధ్యాసలో ఉన్న మనం అసలు పట్టించుకోలేదు వెనక నుంచి అనిల్ ఒక చేయి రాజు గాడు ఒక చేయి పట్టుకున్నారు ఎంటా అని తల ఎత్తి చూస్తే డిక్కీ కొట్టడానికి పందెం కోడి లాగ, కసితో ఉన్న పొట్టేలు లాగ, పశుపతి ని చంపడానికి వస్తున్న జేజెమ్మ లాగ వస్తోంది ... "రెయ్ వధలండ్రా ఏదో చిన్న తలకాయ పగలకొట్టకండి రా" అనే లోపల సుత్తితో కొట్టినట్టు కొబ్బరి బొండం నెత్తి మీద పడినట్టు దెబ్బ పడింది దెబ్బకు బైర్లు కమ్మాయి ఒక రెండు నిమిషాలు ఎవరు కనపడటం లేదు అందరి నవ్వులు వినిపిస్తున్నాయి ... తేరుకున్నాక అప్పటికి తిని అభి నందు రిసెప్షన్ కి రెడీ అవ్వడానికి వెళ్లారు ... లారక్క బర్రె అరిచినట్టు నవ్వుతోంది ... వర్ష అయ్యో పాపం అని చూస్తోంది నాకు కోపం వచ్చి తినేది మానేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయా… రూం కి వెళ్లి అభి గాడిని రెడీ చేస్తుంటే మెసేజ్ వచ్చింది "సారీ భరత్ గారు" అని బాధ పడుతున్న స్మైలీ పంపింది "పర్లేదు నవ్వుతున్న స్మైలీ పంపాను "... థాంక్స్ అని నమస్కారం పంపింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com