వాహన డ్రైవర్లకు యూఏఈ పోలీస్ వార్నింగ్ మెసేజ్‌లు
- January 02, 2019
వింటర్ వెదర్ కండిషన్స్ నేపథ్యంలో అబుదాబీ పోలీస్, తమ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో వాహనదారులకు కొన్ని సూచనలతో కూడిన మెసేజ్‌లను పోస్ట్ చేస్తోంది. ఫాగీ కండిషన్స్ కారణంగా లో విజిబిలిటీ వుంటుందని వాహనదారులకు సూచించింది అబుదాబీ పోలీస్. ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా ఓవర్ టేకింగ్ విషయంలో జాగ్రత్తగా వుండాలనీ, వీలైనంతవరకు ఓవర్ టేకింగ్ చేయరాదని పేర్కొంది. అథారిటీస్ చేసిన సూచనలకు భిన్నంగా వాహనాలు నడిపితే, 500 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. మొబైల్ ఫోన్ల ద్వారా రోడ్లపై ఎలాంటి షూట్స్ జరపరాదనీ, అలీ చేస్తే 800 దిర్హామ్‌ల జరీమానాతోపాటు 4 ట్రాఫిక్ పాయింట్స్ కూడా విధిస్తారు. హై బీమ్‌తో వాహనాలు నడిపితే 500 దిర్హామ్‌ల జరీమానా, నాలుగు బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. హజార్డ్ లైట్స్ అవసరం లేకపోయినా ఉపయోగించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని పోలీస్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







