కేరళలో ఉద్రిక్త పరిస్థితులు
- January 03, 2019
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనను నిరసిస్తూ కేరళలో బంద్ నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ కేరళలో అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కాలికట్, కన్నూర్, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో నిరసనకారులు బస్సులపై, ప్రభుత్వ కార్యాలయాలపై రాళ్లు రువ్వుతున్నారు. నిరసనకారుల దాడిలో 60 బస్సులు ధ్వంసమయ్యాయి. దీనితో కెఎస్ ఆర్టిసి బస్సు సర్వీసులను నిలిపివేసింది. మలప్పురంలో సిపిఎం కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేస్తున్నారు. పోలీసులు 8 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







