క్రిస్మస్ పర్వదినాన నైజీరియాలో విషాదం
- December 24, 2015
క్రిస్మస్ పర్వదినాన నైజీరియాలో విషాదం చోటు చేసుకుంది. ఆగ్నేయ నైజీరియాలోని న్యూవీ పారిశ్రామిక ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ ట్రక్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మరణించారు. క్రిస్మస్ పండగ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ ఎక్కించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంభవించిన వెంటనే అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్నేయ నైజీరియాలో అధిక సంఖ్యలో క్రిస్టియన్లు నివసిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









