సౌదీ అరేబియాలో తలాక్..మహిళల హక్కుల సంరక్షణ
- January 07, 2019
సౌదీ అరేబియాలో చాలా మంది మహిళలకు భర్తలు తమకు తలాక్ ఇచ్చిన విషయమే తెలీడం లేదు. ఆ పరిస్థితిని మార్చడానికి ఆదివారం ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. మహిళలకు తలాక్ గురించి మెసేజ్ పంపించి, విడాకుల సమాచారం అందించాలనే కొత్త నిబంధనలను ఆదివారం నుంచి సౌదీ అరేబియాలోని అన్ని కోర్టుల్లో తప్పనిసరి చేశారు. "ఈ చట్టం వల్ల పురుషులు తమ భార్యలకు సమాచారం ఇవ్వకుండానే విడాకులు తీసుకునే కేసులకు అడ్డుకట్ట పడుతుంది" అని స్థానిక మహిళా న్యాయవాదులు చెప్పారు. ఇలాంటి కేసులను 'రహస్య విడాకులు'గా భావిస్తుంటారు.
చట్టంలోని మార్గనిర్దేశకాలు మహిళలకు వారి వైవాహిక స్థితి గురించి పూర్తి సమాచారం ఉండాలని చెబుతున్నాయి. ఈ నిబంధన ద్వారా వారికి దక్కాల్సిన భరణం, పోషణ ఖర్చులు లాంటి హక్కులను సంరక్షించవచ్చని భావిస్తున్నారు. సౌదీ అరేబియా గత ఏడాది మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇది దశాబ్దాలపాటు కొనసాగుతూ వచ్చింది.
మహిళల హక్కుల సంరక్షణ
"మహిళలకు విడాకులు ఇచ్చినపుడు వారి హక్కులను సంరక్షించేలా, విడాకులకు ముందు అటార్నీ అధికారాలు దుర్వినియోగం కాకుండా ఈ కొత్త చట్టం నిర్ణయాలు తీసుకుంటుందని" సౌదీ అరేబియా న్యాయవాది నస్రీన్ అల్ గామదీ బ్లూంబర్గ్‌తో చెప్పారు. "చాలా మంది మహిళలు భర్తలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తలాక్ ఇచ్చారని కోర్టుల్లో అపీల్ చేశారు" అని న్యాయవాది సామియా అల్ హిందీ స్థానిక పత్రికతో చెప్పారు. ఆర్థిక, సామాజిక సవరణల ప్రక్రియలో భాగంగా ఈ కొత్త నిబంధనలు అమలు చేసినట్టు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. వీటి ప్రకారం మహిళలకు ఫుట్‌బాల్ మ్యాచ్ చూడ్డానికి, సంప్రదాయం ప్రకారం పురుషులే చేయాలని చెప్పే చాలా పనులు చేయడానికి అనుమతులు ఇచ్చారు.
సౌదీ అరేబియా మహిళలు ఇప్పటికీ చేయలేనివి
సౌదీ అరేబియాలో మహిళలు ఇప్పటికీ చేయలేనివి కొన్ని అలాగే ఉన్నాయి. అంటే ఆ దేశంలోని మహిళలు ఇప్పటికీ కొన్ని పురుషులు అంటే భర్త, తండ్రి, సోదరుడు లేదా కొడుకు అంగీకారంతో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అవి...
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు
విదేశీ యాత్ర
వివాహం
బ్యాంక్ అకౌంట్ తెరవడం
వ్యాపార చేయడం
ప్రత్యామ్నాయ సర్జరీలు
పురుషుల సంరక్షణ వ్యవస్థ ఉండడం వల్ల సౌదీ అరేబియాను మధ్యప్రాచ్యంలో అత్యంత లైంగిక అసమానత ఉన్న దేశంగా భావిస్తారు.
తాజా వార్తలు
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







