డ్రగ్స్‌తో ఇద్దరి అరెస్ట్
- January 08, 2019
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 4 వద్ద ఇద్దరు ప్రయాణీకుల నుంచి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీరిద్దరూ కైరో నుంచి వచ్చినట్లు కస్టమ్స్ మీడియా కమిటీ మెంబర్ నవాఫ్ అల్ మటార్ చెప్పారు. కస్టమ్ అధికారులు, టీ4 టెర్మినల్ వద్ద అనుమానాస్పదంగా వున్న ఓ వ్యక్తిని ఆపి సోదాలు నిర్వహించగా ఆ వ్యక్తి నుంచి హాషిస్, నార్కోటిక్స్ కలిగిన ఆరు పిల్స్ లభించాయి. వ్యక్తిగత అవసరాల కోసం వాటిని తమవెంట తెచ్చుకున్నట్లు నిందితుడు తెలిపాడు. మరో కేసులో, అదే రోజు కైరో నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 160 నార్కోటిక్ పిల్స్, 7 పిల్స్ హాషిస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన అధికారులు, తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







