స్వల్ప సాంకేతిక సమస్యతో దుబాయ్ మెట్రో సేవలకు అంతరాయం
- January 08, 2019
అల్ రషిద్యా స్టేషన్ మరియు యూఏఈ ఎక్స్‌ఛేంజ్ స్టేషన్ మధ్య చిన్న సాంకేతిక సమస్య కారణంగా మెట్రో సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ పేర్కొంది. దుబాయ్ మెట్రోకి చెందిన రెడ్ మరియు గ్రీన్‌లైన్స్‌కి సంబంధించి యూనియన్ స్టేషన్ వద్ద నాలుగు నిమిషాల ఆలస్యం చోటు చేసుకుంది. దాంతో బుర్‌జుమన్ స్టేషన్ మరియు ఎడిసిబి స్టేషన్ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం పీక్ టైమ్‌లో ఈ సమస్య రావడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఇతర స్టేషన్లలో సమస్యలేమీ తలెత్తలేదని ఆర్‌టిఎ పేర్కొంది. చిన్న సమస్య కారణంగా లాంగ్ డిలేస్ ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రయాణీకులు వాల్పోయారు. అల్ రషిదియా మరియు యూఏఈ ఎక్స్‌ఛేంజ్ వద్ద ట్రైన్స్‌ని రెడ్ లైన్ మీద ఆపివేసినట్లు ప్రయాణీకులు సోషల్ మీడియాలో తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







