పాక్‌లో ఆకస్మికంగా పర్యటించనున్న తొలి భారత ప్రధాని కూడా మోదీనే!
- December 25, 2015
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అకస్మాత్తుగా పాకిస్థాన్‌లో పర్యటించనున్న సందర్భంగా లాహోర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా లాహోర్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల భారీగా భద్రతా దళాలను మోహరించారు. పోలీసులతోపాటు పాకిస్థాన్ రేంజర్లు కూడా లాహోర్ చేరుకుని భద్రతని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని లాహోర్‌లో ఈ సాయంత్రం రెండు గంటల పాటు ఉంటారని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి నుంచి నేరుగా లాహోర్ చేరుకోనున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి... ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని అయ్యాక మోదీ పాక్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. పాక్‌లో ఆకస్మికంగా పర్యటించనున్న తొలి భారత ప్రధాని కూడా మోదీనే.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









