సౌదీ అమ్మాయికి కెనడా ఆశ్రయం
- January 12, 2019
సౌదీ అరేబియాకు చెందిన 18 ఏళ్ల రాహఫ్ అల్ కునన్ అనే అమ్మాయికి కెనడా దేశం ఆశ్రయం కల్పించింది. కువైట్‌లోని తన ఫ్యామిలీ నుంచి పరారీ అయిన ఆమె ఇటీవల థాయిలాండ్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకున్న ఆమె సోషల్ మీడియా ద్వారా తనకు జరిగిన అన్యాయం గురించి వెల్లడించింది. ఆ తర్వాత రాహఫ్కు ఆశ్రయం కల్పించేందుకు కెనడా ముందుకు వచ్చింది. వాస్తవానికి బ్యాంకాక్ అధికారులు ఆమెను అరెస్టు చేసి ఓ హోటల్లో నిర్బంధించారు. కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె పోరాటం సాగించింది. అసలేం జరిగింది.. పేరెంట్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రాహఫ్ ఎవరికీ చెప్పకుండా థాయిలాండ్ చేరుకున్నది. అయితే బ్యాంకాక్‌లోని ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను కొన్ని రోజుల క్రితం ఓ హోటల్లో బంధించారు. తిరిగి ఆ టీనేజర్‌ను కువైట్‌లో ఉన్న ఆమె పేరెంట్స్‌కు అప్పచెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కుటుంబసభ్యులతో తనకు ప్రాణ హాని ఉందని, తాను ఇస్లాం మతాన్ని వదిలివేశానని, అందుకే ఆస్ట్రేలియా పారిపోతున్నట్లు ఆమె ఓ వీడియో సందేశంలో చెప్పింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా థాయ్‌కు వెళ్లిన ఆ టీనేజర్‌ను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సౌదీ ఎంబీసీ అధికారులు ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ దేశమైనా తనకు ఆశ్రయం కల్పిస్తే అక్కడకి వెళ్తానని ఆమె తన వీడియో సందేశంలో కోరింది. ఇస్లామ్‌ను వదిలివేసి ఇంటికి వెళ్లిన వారిని దారుణంగా శిక్షిస్తారని, అందుకే తనకు కువైట్‌కు వెళ్లాలని లేదని ఆమె తన వీడియో సందేశంలో చెప్పింది. ఐక్యరాజ్యసమితి తనకు ఆశ్రయం కల్పించాలని కోరింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







