కొత్త విమానాల్ని ప్రకటించిన ఇండియన్ ఎయిర్‌లైన్
- January 12, 2019
మస్కట్: ఇండియాకి చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్ గో ఎయిర్, వారంలో ఏడు విమానాలు నడిపే దిశగా కొత్త ప్రకటనను విడుదల చేసింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కేరళలోని కన్నుర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఈ విమానాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని ఒమన్ - పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఏ) పేర్కొంది. గో ఎయిర్ ఆపరేషన్‌కి సంబంధించి అనుమతులు మంజూరు చేసినట్లు పిఎసిఎ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. లో కాస్ట్ ఇంటర్నేషనల్ కెరియర్ అయిన గో ఎయిర్, ముంబై కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఇండియాలో ఐదో అతి పెద్ద ఎయిర్‌లైన్‌గా 2017లో గో ఎయిర్ గుర్తింపు తెచ్చుకుంది. ఇంకో వైపు కేరళలో ఐదవ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్నుర్ పేరుగాంచింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







