కార్పొరేట్ ట్యాక్స్ ప్రతిపాదనలు మాత్రమే
- December 25, 2015
కార్పొరేట్ ట్యాక్స్‌లపై ప్రతిపాదనలు జరుగుతున్న మాట వాస్తవమేనని, వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్నులు విధించడంలేదని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ వర్గాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనంతో ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు పన్నులు విధించడమే మార్గమని కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరకు వెళ్ళాయి. వీటిల్లో కార్పొరేట్ ట్యాక్స్‌పై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుండగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో కూడా చర్చ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అయితే ఆయిల్ ధరల పతనంతో బడ్జెట్‌పై ఏమాత్రం ప్రభావం ఉండదని, ఏ ప్రాజెక్ట్‌ని కూడా ఈ కారణంగా ఆపివేయడంలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఒప్పుకుంటే విలువ ఆధారిత పన్ను 2018 లేదా 2019 నుంచి అమల్లోకి రావొచ్చని ఫైనాన్షియల్ మినిస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









