క్యాన్సర్‌ని జయించిన ప్రముఖ హీరో కుమారుడు
- January 16, 2019
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కుమారుడు క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాడు. దీంతో ఇమ్రాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమాన్ క్యాన్సర్‌ను జయించాడని సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
“అయాన్ ఐదేళ్ల పొరాడి క్యాన్సర్‌ను జయించాడు. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. అలాగే ఆయాన్ కోలుకోవాలని ప్రార్థనలు చేసి, విష్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారందరూ కోలుకోవాలని ఎప్పుడూ దేవుడ్ని ప్రార్థిస్తూనే ఉంటాను”. అంటూ ఇమ్రాన్ ఇన్‌స్ట్రాగామ్‌లో తన కూమరుడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు అయాన్‌ను ఆశీర్వదించారు. అయాన్‌కు క్యాన్సర్ ఉన్న విషయం 2014లో బయటపడింది. ఆ విషయం తెలిసి నా భార్య చాలా బాధపడింది. కానీ తన బాధ ఎక్కడ పైకి కనిపించలేదు. కానీ నేను తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నా. బాబుని తను ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా చూసుకుంది. చికిత్స సమయంలో బాబు పక్కనే ఉంటూ ప్రతిది తనే చూసుకుంది. నేను షూటింగ్‌లో బిజీగా ఉన్న తను బాబుతోనే ఉంది. నిజంగా భావోద్యేగాలు అణుచుకోవడంలో మహిళలకు ఎవరూ సాటి లేరు. నిజంగా తనకు హ్యాట్సాఫ్ చెప్పాలి’ అని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







