పాకిస్తాన్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం..
- December 25, 2015
పాకిస్తాన్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం, ఆతిథ్యం లభించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. మోదీ కోసం ప్రత్యేక వంటకాలు చేయించారు. శుక్రవారం సాయంత్రం లాహోర్ నగర శివారు రాయ్ విండ్ లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లిన మోదీకి.. పాక్ ప్రధాని కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. షరీఫ్ తన కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని తల్లి అక్కడికి రాగా.. మోదీ ఆమెకు పాదాభివందనం చేశారు. నవాజ్ తన నివాసంలో మోదీకి ఏర్పాటు చేసిన విందులో ఆయనకు ఇష్టమైన సాగ్, దాల్, శాకాహార వంటకాలను వండించారు. మోదీకి ప్రత్యేకంగా కశ్మీరీ టీ అందజేశారు. ఈ రోజు షరీఫ్ పుట్టినరోజుతో పాటు ఆయన మనవరాలి పెళ్లి. పాక్ ప్రధాని మనవరాలి వివాహంలో అనుకోని అతిథిలా నరేంద్ర మోదీ తళుక్కున మెరిశారు. ఊహించనివిధంగా మోదీ పాక్ పర్యటనకు వెళ్లడం ఇరు దేశాల్లోనూ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం లాహోర్ వెళ్లిన మోదీకి విమానాశ్రయంలో షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇద్దరూ ప్రత్యేక హెలికాప్టర్ లో షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్ కు జన్మదినశుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన మనవరాలిని ఆశీర్వదించారు. అనంతరం లాహోర్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. 'పాక్ ప్రధాని ఎంతో ఆత్మీయత చూపారు. ఈ రోజు సాయంత్రం నవాజ్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపాను. షరీఫ్ జన్మదినం, ఆయన మనవారి వివాహం రెండు వేడుకల్లో పాల్గొన్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







