10 మంది మహిళా వలసదారుల అరెస్ట్
- January 19, 2019
మస్కట్: 10 మంది మహిళా వలసదారుల్ని రెసిడెన్సీ చట్ట ఉల్లంఘన, పబ్లిక్ మోరల్స్ దెబ్బతీస్తున్నారనే అభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. సోహార్లో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన మహిళలు ఆసియా జాతీయులు కాగా, ఏయే దేశస్తుల్ని అరెస్ట్ చేశారన్నదానిపై పోలీసులు ఎలాంటి వివరాలు తెలుపలేదు. నార్త్ బతినా గవర్నరేట్ పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ అరెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఆన్లైన్ ప్రకటన ఒకటి రాయల్ ఒమన్ పోలీస్ విడుదల చేసింది. అరెస్ట్ అయినవారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







