సుమారు 4,000 ఒమనీ జాబ్ సీకర్స్‌కి ఇంటర్వ్యూలు
- January 21, 2019
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 3,876 ఒమనీ జాబ్ సీకర్స్‌కి ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చింది. ప్రైవట్ సెక్టార్‌లోని 358 ఉద్యోగాలకుగాను ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆరు గవర్నరేట్స్ పరిధిలో మొత్తం 58 కంపెనీలు ఈ ఉద్యోగాల్ని అందించనున్నాయి. జనవరి 20 నుంచి జనవరి 24 వరకు ఈ ఇంటర్వ్యూలు మస్కట్, నార్త్ మరియు సౌత్ బతినా, సౌత్ షర్కియా, దఖ్లియా మరియు బురైమి గవర్నరేట్స్ పరిధిలో జరుగుతాయి. 527 మంది జాబ్ సీకర్స్ సోమవారం ఇంటర్వ్యూలకు హాజరవుతారు. 630 మంది జాబ్ సీకర్స్ జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కలిగి వున్నారు. ప్రైవేటు కంపెనీలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామనీ, ఆయా కంపెనీలు ఒమనైజేషన్‌కి పూర్తిస్థాయిలో సహకరించాలని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..