జూనియర్ బచ్చన్ ఉన్నాడంటూ అంచనాలు పెంచేస్తున్న భారతీయుడు 2
- January 21, 2019
కమల్ హాసన్ కెరీర్ లోనే విలక్షణ చిత్రంగా నిలిచింది భారతీయుడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఇటివలే ఈ సినిమా ప్రీ-లుక్ రిలీజ్ చేశాడు దర్శకుడు శంకర్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ జూనియర్ బచ్చన్ అభిషేక్ నటించనున్నారని టాక్. ఈ చిత్రంలో అభికి పవర్ఫుల్ పాత్ర దక్కినట్లు తెలుస్తోంది.
తన పాత్ర గురించి వినగానే అభిషేక్ వెంటనే ఒప్పేసుకున్నారట. మరోపక్క బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఇందులో ఆయన విలన్ పాత్రలో నటించే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇందులో కమల్ హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాస్కరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్. 2019 ద్వితియార్ధంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







