ఐఎస్‌ఐ కుట్ర భగ్నం : 9 మంది ఉగ్రవాదుల అరెస్ట్
- January 23, 2019
మహారాష్ట్ర : పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న 9 మందిని ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్టు చేసింది. భారీ దాడులకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఉగ్రవాదుల కుట్రను యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ భగ్నం చేసింది. నిఘా వర్గాలందించిన సమాచారం మేరకు గత కొంతకాలంగా అనుమానితులపై నిఘా వేసిన ఏటీఎస్ 12 ప్రత్యేక బృందాలతో థానే జిల్లాలోని ముంబ్రా, ఔరంగాబాద్ సహా ఐదుచోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టింది. ఈ క్రమంలో జరిపిన దాడుల్లో ఔరంగాబాద్ నుంచి నలుగురు, ముంబ్రా, థానే నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు 17 నుంచి 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
'మాకు సమాచారం అందేసరికే ఈ ముఠా దాడులకు సిద్ధమైందనీ..అందుకే స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలలోను ఏకకాలంలో దాడులు నిర్వహింకటంతో వారిని పట్టుకోగలిగామని...వారి వద్ద నుంచి ప్రమాదకరమైన రసాయనాలు, పౌడర్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, యాసిడ్ బాటిల్, పదునైన కత్తులు స్వాధీనం చేసుకున్నామనీ ఏటీఎస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







