ఆటమ్న్‌ ఫెయిర్‌ 2019 ప్రారంభం

- January 24, 2019 , by Maagulf
ఆటమ్న్‌ ఫెయిర్‌ 2019 ప్రారంభం

మినిస్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, కామర్స్‌ అండ్‌ టూరిజమ్‌ జాయెద్‌ అల్‌ జయెని, కామర్స్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ నాడెర్‌ అల్‌ మోయాద్‌ నేతృత్వంలో ఆటమ్న్‌ ఫెయిర్‌ 2019 ప్రారంభమయ్యింది. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ మరియు కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ ఈవెంట్‌ ప్రారంభమయ్యింది. అరేబియన్‌ ఎగ్జిబిషన్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణలో జనవరి 31 వరకు ఈ ఈవెంట్‌ జరుగుతుంది. 30వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ ఆటమ్న్‌ ఫెయిర్‌ని 15,400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేశారు. 18 దేశాలకు చెందిన 650 మంది ఎగ్జిబిటర్స్‌ తమ ప్రోడక్ట్స్‌ని ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. క్రాఫ్ట్స్‌, బోటిక్స్‌ మరియు ఫ్యాషన్‌, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ మరియు అప్లయన్సస్‌, ఫర్నిచర్‌ మరియు ఫర్నిషింగ్స్‌, హౌస్‌వేర్‌ మరియు డెకార్స్‌, కిచెన్‌ వేర్‌, లెథర్‌ గూడ్స్‌, షూస్‌, కాస్మెటిక్స్‌, టాయ్స్‌, టెక్స్‌టైల్స్‌, ప్రత్యేకించి ఫుడ్స్‌ ఈ ఎగ్జిబిషన్‌లో అందర్నీ ఆకర్షించనున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com