మహిళా అమెరికన్‌ డిప్లమాట్‌పై దాడి

- January 24, 2019 , by Maagulf
మహిళా అమెరికన్‌ డిప్లమాట్‌పై దాడి

కువైట్‌ సిటీ: విన్సిటీ ఆఫ్‌ జాగింగ్‌ ట్రాక్‌పై అమెరికాకి చెందిన మహిళా డిప్లమాట్‌పై దాడికి దిగిన ఓ అనుమానిత వ్యక్తి కోసం హ్మదీ రీసెర్చ్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ - క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అన్వేషణ ప్రారంభించడం జరిగింది. మహబౌలాలో ఈ ఘటన జరిగింది. ఈ దాడి రాజకీయ కారణాలతో జరిగిందంటూ తెరపైకి వచ్చిన ప్రచారాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్‌ కొట్టి పారేశాయి. అబు హలీఫా పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి సంబంధించి మెడికల్‌ రిపోర్ట్‌ని కూడా ఆ మహిళా డిప్లమాట్‌ పోలీసులకు అందించారు. మరోపక్క, సెక్యూరిటీ అథారిటీస్‌ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com