ఏటీఎం కార్డ్‌ బ్లాక్‌: ఈ మెసేజ్‌ పట్ల అప్రమత్తంగా వుండాలి

- January 26, 2019 , by Maagulf
ఏటీఎం కార్డ్‌ బ్లాక్‌: ఈ మెసేజ్‌ పట్ల అప్రమత్తంగా వుండాలి

యూఏఈ రెసిడెంట్స్‌ మరో స్కామ్‌కి సంబంధించిన అనుభవాల్ని ఎదురుచూస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లలో వాఆ్సప్‌ ద్వారా 'మీ ఏటీఎం కార్డ్‌ సేవలు స్తంభించిపోయాయి' అనే మెసేజ్‌లతో అక్రమార్కులు వినియోగదారుల్ని మోసం చేస్తుండడమే ఆ స్కామ్‌. దీనికి సంబంధించి ఫుజారియా పోలీసులు, వినియోగదారుల్ని అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ కార్డ్‌ బ్లాక్‌ అయ్యిందనీ, దాన్ని తిరిగి పనిచేసేలా చెయ్యడానికి ఫలానా నెంబర్‌ని సంప్రదించాలని ఆ స్కామ్‌ మెసేజ్‌లో అక్రమార్కులు పేర్కొంటున్నారు. ఇలాంటి స్కామ్‌ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్‌ సిబ్బందిని సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com