శింబు బ్రేకప్ అయినప్పుడు కూడా ఏడ్వలేదు:మహత్
- January 27, 2019
చెన్నై: కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన ప్రస్తుతం 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ 'వంత రాజవంతాన్ వరువెన్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో మేఘా ఆకాశ్, కేథరిన్ కథానాయికల పాత్రలు పోషించారు. నదియా పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఫిబ్రవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మణిరత్నం తెరకెక్కించిన 'చెక్క సీవంత వానం' (తెలుగులో 'నవాబ్') సినిమాలోని డైలాగ్ స్ఫూర్తితో ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు మహత్ మీడియాతో మాట్లాడారు. తన మిత్రుడు శింబు గురించి చెప్పారు. ఆయన ఎప్పుడూ ఏడ్వలేదని, కేవలం ఒక్కసారి చాలా కుమిలిపోయారని అన్నారు. 'ప్రేమలో విఫలమైనప్పుడు బాధను వ్యక్తపరుస్తూ ఏడుస్తారు. కానీ శింబు బ్రేకప్ అయినప్పుడు కూడా ఏడ్వలేదు. కానీ కావేరీ జలాల వివాద సమయంలో శింబు ఓ వీడియోను విడుదల చేశారు. అప్పుడు ఆయన్ను విమర్శిస్తూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో శింబు చాలా ఏడ్చారు. వీడియోలోని ప్రతి మాట ఆయన హృదయం నుంచి వచ్చింది. కానీ ప్రజలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో శింబు ఎంతో బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ కర్ణాటక కావేరీ జలాలను వదిలింది. కాబట్టి శింబు ప్రయత్నం విజయవంతమైందనే చెప్పొచ్చు' అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







