హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- February 06, 2026
కువైట్: కువైట్ లోని హవల్లి గవర్నరేట్లో వాణిజ్య సముదాయాలతోపాటు వినియోగదారులను ప్రభావితం చేసే ప్రకటనలపై కువైట్ మునిసిపాలిటీ అధికారులు ఫోకస్ చేశారు. మునిసిపాలిటీలోని ఆడిట్ మరియు మునిసిపల్ సర్వీసెస్ మానిటరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణాలు మరియు ప్రకటనల అనుమతుల కోసం ఆరోగ్య లైసెన్సుల చెల్లుబాటును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 65 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వారిపై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకున్నామని మునిసిపాటిలీ పేర్కొంది. రాబోయే వారాల్లో అన్ని గవర్నరేట్లలో అదనపు క్షేత్రస్థాయి తనిఖీలతో క్యాంపెయిన్ కొనసాగుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







