భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది..
- January 28, 2019
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ట్రైన్ 18కు పేరు పెట్టింది కేంద్రం. ఈ రైలును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పిలవనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఢిల్లీ-వారణాసి మధ్య రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలోనే ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. 16 కోచ్‌లు కలిగిన ఈ ట్రైన్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. పూర్తి ఎయిర్ కండీషన్డ్ సదుపాయం ఉన్న ఈ రైలు కాన్పూర్, అలహాబాద్‌లో మాత్రమే ఆగుతుంది.
ట్రైన్ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలను కోరగా, వేల సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయి. చివరకు మేము వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశాం. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు అందిస్తున్న బహుమతి ఇది. ప్రధాని మోడీ దీన్ని త్వరలోనే ప్రారంభించాలని కోరుతున్నా అన్నారు గోయల్.
శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే వందే భారత్ ట్రైన్లో ప్రయాణ ఛార్జీలు 40 నుంచి 50 శాతం అధికంగా వసూలు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలు 2 వేల 800 రూపాయల నుంచి 2 వేల 900 రూపాయల మధ్య ఉండగా.. చైర్ కార్ 1600 నుంచి 1700 రూపాయలు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







