నేటి నుంచి హెచ్-1బి ప్రీమియం ప్రాసెసింగ్
- January 28, 2019
వాషింగ్టన్: హెచ్-1బి వీసా దరఖాస్తుల 'ప్రీమియం ప్రాసెసింగ్' ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుందని అమెరికా ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గానూ దాఖలైన అన్ని 'హెచ్-1బి క్యాప్' పిటిషన్లను పరిశీలించనున్నట్టు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే ఇది వర్తిస్తుందని, కొత్తవాటిని స్వీకరించట్లేదని స్పష్టం చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్ కింద పిటిషన్‌దారులు అదనంగా రుసుము చెల్లించి తమ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను 15 రోజుల్లోపే పూర్తిచేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో పిటిషన్లు పేరుకుపోవడంతో ఇటీవల కొంత కాలం ఈ ప్రక్రియను అమెరికా నిలిపివేసింది. కొన్ని విభాగాల్లో ఈ నిలిపివేత ఇంకా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







