ఇంగ్లండ్‌లో భారీ వరదలు...
- December 26, 2015
ఇంగ్లండ్‌లో భారీ వరదలు ► ఇప్పటివరకు 335 హెచ్చరికలు జారీ ► సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు ► వరద చూసేందుకు బయటకు రావద్దని హెచ్చరిక లండన్ బ్రిటిషర్లను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎక్కడా కనీ వినీ ఎరుగని రీతిలో వర్షాలు ముంచెత్తడంతో ప్రజలతో పాటు అధికారులకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. సమ్మర్‌సీట్ ప్రాంతంలో ఇర్వెల్ నది మీద 200 ఏళ్ల క్రితం కట్టిన పబ్ ఒకటి ఆ నది వరదల కారణంగా కుప్పకూలిపోయింది. ఇర్వెల్ నదిని దాటేందుకు కట్టిన వంతెన మీదే ఈ వాటర్‌సైడ్ పబ్, రెస్టారెంట్ భవనం ఉండేది. అయితే భారీ వర్షాల కారణంగా ఇర్వెల్ నదికి వచ్చిన వరదలతో ఆ వంతెన, దాంతోపాటు 200 ఏళ్ల నాటి పబ్ రెండూ కుప్పకూలిపోయాయి. రాబోయే రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షపాతం ఉండబోతోందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే 'రెడ్ ఎలర్ట్' జారీచేసింది. వరదలను చూసేందుకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, ఇక్కడ అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని లాంక్‌షైర్ సిటీ కౌన్సిల్ ప్రజలను కోరింది. అలా వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని తెలిపింది. కాగా, భారీ వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఉండే ప్రజలను అక్కడి నుంచి సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు. లాంక్‌షైర్‌లోని వాలీ, రిబ్‌చెస్టర్ ప్రాంతాల ప్రజలు ఇప్పటికే ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. ఒక్క గంటలోనే తీవ్ర వరద హెచ్చరికలు రెట్టింపు అయ్యాయి. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లండ్ వ్యాప్తంగా ఇప్పటికి 335కు పైగా హెచ్చరికలు జారీ చేశారు
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







