హైదరాబాద్‌లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం
- January 29, 2019
హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తాజాగా మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
హైదరాబాద్‌లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వాతావరణం చల్లబడడంతో ఈ మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నాలుగు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. శామీర్‌పేట్ నల్సార్ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులకు ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 9కి చేరింది. నల్సార్ విద్యార్థులకు ముందే మరో ఐదుగురిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేసుకోవాలన్నారు.
చిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్వైన్ ఫ్లూ బారి నుంచి కాపాడుకోవచ్చు. సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అయితే జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వెళ్లగానే చేతులు, కాళ్లు సబ్బుతో కడుక్కోవాలి. మూడు కన్నా ఎక్కువ రోజులు పై లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







