ఏపీలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
- January 29, 2019
ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫ్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే.. సంబంధిత జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో లభించే దరఖాస్తులను నింపి, దానికి ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి అదే కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు విక్రయిస్తారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు..
డ్రైవర్ ఆపరేటర్: 85 పోస్టులు
జిల్లాలవారీగా ఖాళీలు..
జిల్లా ఖాళీలు
శ్రీకాకుళం 02
విజయనగరం 01
విశాఖపట్నం 10
తూర్పు గోదావరి 06
పశ్చిమ గోదావరి 05
కృష్ణా 20
గుంటూరు 18
ప్రకాశం 02
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 04
కర్నూలు 04
అనంతపురం 03
చిత్తూరు 06
వైఎస్ఆర్ కడప 04
మొత్తం ఖాళీలు 85
అర్హత: 01.07.2018 నాటికి పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులకు హెవీ మోటారు వెహికిల్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







