అతి బలవంతుడు ఫహద్ మొహమ్మద్
- January 30, 2019
కువైట్ సిటీ: కువైట్‌కి చెందిన ఫహద్ మొహమ్మద్, గ్రీస్‌లో ప్యాసింజర్ విమానానికి తన బలమేంటో చూపబోతున్నాడు. మే నెలలో ఈ ప్రదర్శన ఇవ్వబోతున్నాడు. అత్యంత బరువైన విమానాన్ని మొహమ్మద్ అవలీలగా లాగేస్తానంటున్నాడు. అంతే కాదు, సెప్టెంబర్‌లో ఓ ట్రైన్‌ని లాగేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దీనికి కెనడా వేదిక కాబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో సాధించి, సరికొత్త రికార్డులు నెలకొల్పాలన్నదే తన ధ్యేయమని మొహమ్మద్ చెబుతున్నాడు. గ్లాస్‌ని నమిలి తినే శక్తి తనకు వుందనీ, ఇనుముని వంచగలననీ, కార్లను అలాగే ట్రక్స్‌ని 'టూత్స్' (దంతాలు)తో లాగగల శక్తి గలవాడిననీ, కారు తన శరీరంపై వెళ్ళినా తనకు ఏమీ కాదని అంటున్నాడాయన. కువైటీ ప్రజల మద్దతు అలాగే దేవుడి ఆశీస్సులతోనే తాను ఇవన్నీ చేయగలుగుతున్నానని మొహమ్మద్ చెప్పారు.
Asian beaten, robbed by 3 individuals
ఆసియా జాతీయుడిపై దాడి
కువైట్: ఆసియా వలసదారుడొకరిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, అతని వద్దనున్న సొమ్ముని దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు జారుకున్నారు. బాధితుడు, దాడి అనంతరం జహ్రా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. భౌతికంగా తనపై నిందితులు దాడి చేసి, తన వద్దనున్న సొమ్ముల్ని దోచుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
School student drowns in Oman
ఒమన్‌లో నీట మునిగిన విద్యార్థి
మస్కట్: సెవెన్త్ గ్రేడ్ స్టూడెంట్, విలాయత్ ఖురియత్లో నీట మునిగి చనిపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ - నార్త్ షక్రియా ఈ విషయాన్ని ఆన్లైన్ ప్రకటన ద్వారా వెల్లడించింది. నార్త్ షర్కియా ఎడ్యుకేషన్, చిన్నారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విలాయత్ ఖురియత్లోని ఫిన్స్‌లో చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Soon, 4 new traffic fines for UAE motorists
త్వరలో 4 కొత్త ట్రాఫిక్ జరీమానాలు
యూఏఈ: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే మోటరిస్టులకి తాజా హెచ్చరిక ఏంటంటే, కొత్తగా మరికొన్ని ట్రాఫిక్ జరీమానాలు విధించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు అథికారులు. పాదచారులకు మెరుగైన భద్రత కల్పించే దిశగా ఈ చర్యలు చేపడుతున్నారు. పెడెస్ట్రియన్ క్రాసింగ్ మీద వాహనాన్ని నిలిపితే 500 దిర్హామ్‌లు జరీమానా విధిస్తారు. రోడ్డు దాటుతున్న పాదచారులకు ఇబ్బంది కలిగేలా వాహనాలతో వ్యవహరిస్తే 400 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. పేవ్మెంట్ మీద పార్క్ చేసే వెహికిల్స్‌కి విధించే 400 దిర్హామ్‌లు మూడో అంశం. జరీమానాలతోపాటు 4 బ్లాక్ పాయింట్స్ కూడా తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకో వైపు అబుదాబీ కొత్త ట్రాఫిక్ వార్నింగ్ రాడార్స్‌ని అమల్లోకి తీసుకురానుంది. స్కూల్స్ వుండే ప్రాంతాలు, అలాగే పాదచారుల క్రాసింగ్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించి, జరీమానాలు విధిస్తాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







