త్వరలో 4 కొత్త ట్రాఫిక్ జరీమానాలు
- January 30, 2019
యూఏఈ: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే మోటరిస్టులకి తాజా హెచ్చరిక ఏంటంటే, కొత్తగా మరికొన్ని ట్రాఫిక్ జరీమానాలు విధించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు అథికారులు. పాదచారులకు మెరుగైన భద్రత కల్పించే దిశగా ఈ చర్యలు చేపడుతున్నారు. పెడెస్ట్రియన్ క్రాసింగ్ మీద వాహనాన్ని నిలిపితే 500 దిర్హామ్‌లు జరీమానా విధిస్తారు. రోడ్డు దాటుతున్న పాదచారులకు ఇబ్బంది కలిగేలా వాహనాలతో వ్యవహరిస్తే 400 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. పేవ్మెంట్ మీద పార్క్ చేసే వెహికిల్స్‌కి విధించే 400 దిర్హామ్‌లు మూడో అంశం. జరీమానాలతోపాటు 4 బ్లాక్ పాయింట్స్ కూడా తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకో వైపు అబుదాబీ కొత్త ట్రాఫిక్ వార్నింగ్ రాడార్స్‌ని అమల్లోకి తీసుకురానుంది. స్కూల్స్ వుండే ప్రాంతాలు, అలాగే పాదచారుల క్రాసింగ్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించి, జరీమానాలు విధిస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







