ఫిబ్రవరి కోసం యూఏఈలో పెట్రో ధరల తగ్గింపు
- January 30, 2019
ఫిబ్రవరి నెల కోసం యూఏఈ ఫ్యూయల్ ప్రైస్ కమిటీ ధరల్ని ప్రకటించింది. వరుసగా నాలుగో నెల కూడా ఫ్యూయల్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సూపర్ 98 అలాగే సూపర్ 95 పెట్రోల్ ధరలో 5 ఫిల్స్ తగ్గించారు. తగ్గించిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. తగ్గించిన ధరల ప్రకారం సూపర్ 98 ధర 1.95 దిర్హామ్‌లకు లభించనుండగా, సూపర్ 95 ధర 1.84కి చేరుకుంది. డీజిల్ ధర 2.30 దిర్హామ్‌ల నుంచి 2.28 దిర్హామ్‌లకు తగ్గించడం జరిగింది. 2015 ఆగస్ట్ నుంచి యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ సబ్సిడీలను అలాగే ఫ్యూయల్ ధరల రెగ్యులేషన్ని తొలగించింది. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు దేశంలో పెట్రో ధరలు మారుతున్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







