దుబాయ్ రాఫెల్ తో ఇండియన్ కుక్కి ఊరట
- January 30, 2019
ఓ ఇండియన్ కుక్కి అదృష్టం కలిసొచ్చి దుబాయ్ రరాఫెల్ లో బహుమతి వరించింది. ఈ విషయం గురించి ఆ కుక్ కమ్ డ్రైవర్ తాలూకు ఓనర్ మాట్లాడుతూ తమ వద్ద కుక్ మరియు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి స్వదేశంలో ఇంటి సమస్య కారణంగా 4 లక్షల రూపాయల అప్పు చేయాల్సి వచ్చిందనీ, అయితే ఆ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందనీ, ఈ క్రమంలో అతనికి కొంతమొత్తం వడ్డీ లేని సాయం చేశానని చెప్పారు. ఓసారి డ్రైవింగ్ చేస్తూ వెళుతుండగా, దుబాయ్ రాఫెల్ టిక్కెట్‌ని అతని పేరు మీదుగా తీసుకున్నాననీ, అదృష్టం కలిసొచ్చి ఆ టిక్కెట్‌కి బహుమతి లభించిందని అన్నారు. ఆ కారుని విక్రయించి, అప్పు తీర్చేశాడనీ, ఇప్పుడతను సంతోషంగా వున్నాడని చెప్పారు ప్రవీణ్ మంఘ్నాని. ఇంకో వైపు, 24వ ఎడిషన్ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ చాలామందికి అద్భుతమైన ఆనందాల్ని తీసుకొచ్చింది. డెయిలీ గోల్డ్ డ్రాలో అనీష్ నందరాజన్, అమిత్ పండిత్, మొహమ్మద్ లోక్మాన్ హకీమ్ మరియు షామ్గిత్ 250 గ్రాముల గోల్డ్ గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







