జయరాం మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..
- February 02, 2019
పారిశ్రామిక వేత్త జయరాం మర్డర్ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాడి చేసిన తరువాత శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ అజ్ఞాతంలోకి వెళ్లాడని.. జయరాం మర్డర్ తరువాత నుంచి శిఖా బాయ్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
జయరాం తలమీద బలంగా దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు వీరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జయరాంపై దాడి చేసిన తరువాత హడావుడిలో అక్కడి నుంచి నిందితులు ఎస్కేప్ అయ్యారు.తనపై దాడి జరగవచ్చని ముందుగానే గుర్తించిన జయరాం…ఆర్థిక లావాదేవిలు తన మెడకు చుట్టుకోవచ్చని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.
జయరాంతో పాటు ఆ రోజంతా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సెల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ఓ గెస్ట్ హౌజ్లో శిఖా చౌదరితో పాటు మరో మహిళను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవిలే అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. అమెరికా నుంచి రేపు ఉదయం హైదరాబాద్కు జయరాం కుటుంబ సభ్యులు రానున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..