యూఎస్:అరెస్టైన విద్యార్థుల కోసం ఎంబసీ హాట్ లైన్
- February 02, 2019
అమెరికాలో సంచలనం సృష్టించిన పే టు స్టే కుంభకోణంలో పోలీసులు అరెస్ట్ చేసిన విద్యార్థుల కోసం భారతీయ రాయబార కార్యాలయం హాట్ లైన్ ఏర్పాటు చేసింది. ఈ హాట్ లైన్ 24/7 పనిచేస్తుందని ఎంబసీ అధికారులు వెల్లడించారు. సుమారు 129మంది భారతీయ విద్యార్థుల్ని అరెస్టు చేసినట్లు అక్కడి యంత్రాంగం ప్రకటించింది. ఈ హాట్ లైన్ లో 202-322-1199, 202-340-2590 నెంబర్లపై అరెస్ట్ అయిన విద్యార్థుల స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎప్పుడై ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటించారు.
న్యూజెర్సీ, అట్లాంటా, హ్యూస్టన్, మిషిగాన్, కాలిఫోర్ని యా, లూసియానా, నార్త్ కరోలినా, మిస్సోరి రాష్ర్టాల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి విద్యార్థులను యూస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిపై పౌర వలస నిబంధనల చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేయనున్నట్లు ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు. వీరంతా హోం ల్యాండ్ సెక్యురిటీ ఇన్వెస్టిగేషన్ అధికారుల స్ట్రింగ్ ఆపరేషన్ లో పట్టుబడ్డారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి అమెరికాలోనే ఉండేందుకు ఈ విద్యార్థులంతా డెట్రాయిట్‌లోని ఫార్మింగ్‌టన్ యూనివర్సిటీలో చేరారు. భారతీయ విద్యార్థులకు సహకారం అందించేందుకు సంబంధిత అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్