లో ప్రెజర్ కారణంగా ఒమన్‌లో వర్షాలు
- February 02, 2019
మస్కట్: ఫిబ్రవరి 3 నుంచి ఒమన్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వుందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ సూచనలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది పిఎసిడిఎ. లో ప్రెజర్ కారణంగా ఆదివారం.. అంటే ఫిబ్రవరి 3 నుంచి బుధవారం అంటే, ఫిబ్రవరి 6 వరకు ఒమన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మస్కట్, ముసాందామ్, అల్ బురైమి, అల్ దహిరాహ్, నార్త్ బతినా, సౌత్ బతినా, అల్ దఖ్లియా, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిసే అవకాశం వున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వుండాలనీ వాడీస్‌లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సముద్రంలో సెయిలింగ్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







