ఫోన్ స్కామ్ గ్యాంగ్ అరెస్ట్
- February 02, 2019
24 మంది సభ్యులు గల ఫోన్ స్కామ్ గ్యాంగ్ సభ్యుల్ని యూఏఈలో అరెస్ట్ చేశారు. అబుదాబీ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితుల్ని ట్రయల్ కోర్ట్‌కి రిఫర్ చేయడం జరిగిందనీ, వారంతా ఆసియాకి చెందినవారనీ, ఫోన్ల ద్వారా బహుమతులంటూ పెద్దయెత్తున మోసాలకు వీరు పాల్పడుతున్నారని తెలుస్తోంది. బాధితుల నుంచి సొమ్ములు రాబట్టాక, నిందితులు ఫోన్లను మార్చేస్తుంటారనీ, ఈ క్రమంలో ఓ బాధితుడు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో నిందితుల్ని అత్యంత వ్యూహాత్మకంగా పట్టుకున్నామనీ అధికారులు వివరించారు. మొదట 17 మందిని అరెస్ట్ చేయగా, వారి నుంచి వచ్చిన సమాచారంతో మరో ఏడుగుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







