సౌదీ ఫాల్కన్రీ ఫెస్టివల్ సరికొత్త గిన్నీస్ రికార్డ్
- February 04, 2019
సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్ అజీజ్ ఫాల్కన్రీ ఫెస్టివల్, గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. లార్జెస్ట్ ఫాల్కన్ రేసింగ్ టోర్నమెంట్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు పది రోజులపాటు జరిగిన ఈ ఫెస్టివల్‌లో 1,723 ఫాల్కన్స్ పాల్గొన్నాయి. సౌదీ ఫాల్కన్స్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోస్సామ్ బిన్ అబ్దుల్ మోహ్‌సెన్ అల్ హజిమి అధికారికంగా ఈ సర్టిఫికెట్‌ని అందుకున్నారు. జిబిఆర్ అధికార ప్రతినిథి షిదా సుబాసి జామిస్సి సమక్షంలో మల్హామ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సర్టిఫికెట్‌ని అందుకోవడం జరిగింది. రియాద్‌లో అ కార్యక్రమం జరిగింది. ఈ పోటీల్లో మొత్తం ప్రైజ్ మనీ 17,630,000 సౌదీ రియాల్స్.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







