ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి
- February 07, 2019
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. సమాచార ఉపగ్రహాల ప్రయోగంలో ఆరి తేరిన ఇస్రో, తాజాగా మరో సమాచార ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్గా అంతరిక్షంలోకి పంపించింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంత రిక్ష పరిశోధనా కేంద్రం నుంచి కమ్యూనికేషన్ శాటిలైట్ జిశాట్-31ను ప్రయోగించారు. ఏరియానా స్పేస్ రాకెట్, జి శాట్-31ను 42 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చింది.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 2 గంటల 31 నిమిషాలకు జీశాట్ -31 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జీశాట్ -31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4ను కూడా రోదసీలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.
జిశాట్ బరువు 2,535 కిలోలు. ఇందులో అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థ ఉంది. ఈ సమా చార ఉపగ్రహం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలందించనుంది. భారతీయ భూభాగాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర కమ్యూ నికేషన్ శాటిలైట్లతో కలసి జిశాట్-31 పని చేయనుంది.
తాజా వార్తలు
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!







