అయోగ్య..టెంపర్ రీమేక్ చిత్ర టీజర్ విడుదల

- February 07, 2019 , by Maagulf
అయోగ్య..టెంపర్ రీమేక్ చిత్ర టీజర్ విడుదల

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం టెంపర్ . ఈ సినిమా హిందీలో సింబా పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తమిళంలో రీమేక్ అవుతుంది. నవ దర్శకుడు, ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.ఆయన సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది. అయోగ్య అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో విశాల్ తన మేనరిజంతో అదరగొట్టాడు. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేశారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. అయోగ్య చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పాటలో విశాల్‌తో కలిసి సన్నీ ఆడిపాడిందట. పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com