సిలికాన్ వ్యాలీ: 'మనబడి' స్నాతకోత్సవం ..!
- February 08, 2019
తెలుగు భాషా పరిరక్షణ కోసం సిలికానాంధ్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా నిర్వహిస్తున్న 'మనబడి' స్నాతకోత్సవం అమెరికాలోని శాన్‌హోసేలోని పార్క్ సైడ్ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు కొండుభట్ల రామచంద్రమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.అమెరికా, కెనడా, హాంకాంగ్ తదితర దేశాల నుంచి 1019 మంది విద్యార్థులు 2015-16 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులయ్యారు.
అమెరికా లోని కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా నిర్వహిస్తున్న 'మనబడి ' స్నాతకోత్సవం ఆదివారం శాన్ హోసే లోని పార్క్ సైడ్ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత వైభవంగా జరిగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు శ్రీ కొండుభట్ల రామచంద్ర మూర్తి తదితర ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొని మనబడి విద్యార్ధులకు పట్టాలు ప్రదానం చేసారు.
అమెరికా, కెనడా, హాంగ్ కాంగ్ మొదలైన దేశాల్లోని 1019 మంది విద్యార్ధులు ఈ సంవత్సరం ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శ ప్రాయమైనదన్నారు. 150 మందితో మొదలైన ఈ విద్యా వ్యవస్థను ప్రస్తుతం 6000 మందికి పైగా విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
'మనబడి' 2007లో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ అనతి కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా రూపొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూఛిబొట్ల ఆనంద్ అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య థోసామయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి డా. మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి డా. వై. రెడ్డి శ్యామల, ప్రజా సంబంధాల అధికారి డా. జుర్రు చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ ఛైర్మన్ దిలీప్ కొండిపర్తి, అధ్యక్షులు సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపామల, శ్రీరాం కోట్ని, మనబడి ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చామర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







