సాకర్ టీమ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- February 08, 2019
రియో: బ్రెజిల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రియో డిజానరోలో ఉన్న ఓ ట్రైనింగ్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. ఫ్లెమింగో సాకర్ టీమ్ అక్కడ ఉంటోంది. అయితే ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అగ్ని మాపక సిబ్బంది వెల్లడించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఉదయం 5 గంటలకు మొదలైన మంటలు ఆరున్నర వరకు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారంతా యూత్ టీమ్ సభ్యులే అని తెలిపారు. చనిపోయినవారిలో అయిదుగురు 14 ఏళ్ల లోపే ఉన్నారు. ప్లేయర్లు ఉండే రూమ్‌లోనే అగ్ని ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







