తెలంగాణా వాసికి విమాన టిక్కెట్ వితరణ
- December 27, 2015
పొట్ట కూటి కోసం అరబ్ దేశాలకు వచ్చి, ఇక్కడే చాలీ చాలని రాబడితో బతుకు ఈడుస్తున్న ఎందరో అభాగ్యులున్నారు. దారి ఖర్చులు భరించలేక, ఎంత అత్యవసరమైనా స్వదేశానికి వెళ్ళలేని దుస్థితి కొందరిది. అలాంటివారిని ఆదుకునే క్రమంలో ఏక్తా - ఇండియన్ కల్చరల్ టీమ్, తెలుగు ఐక్యం, మా గల్ఫ్ టీమ్ సంయుక్తంగా ఓ కార్యక్రమం చేపట్టింది. మల్లయ్య అనే వ్యక్తికి ఇండియా వెళ్ళడానికి టిక్కెట్, మరియు ఇతర అవసరాల నిమిత్తం సహాయం చేయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. ఏక్తా - ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ తరఫున జయరాజయ్, టిక్కెట్‌ను స్పాన్సర్ చేశారు. ఇతర ఎక్స్పెన్సెస్ను రాజేష్‌బాబు, యాదవ్ రాగం, శ్రీకాంత్ (మా గల్ఫ్), సుధీర్ ముఖర్జీ, శాంతి, సురేష్, హనీఫ్, బిర్యానీ ప్యాలెస్ రెస్టారెంట్ - అబ్దుల్ రవూఫ్, క్లాసిక్ రెస్టారెంట్, వసంత్‌కుమార్. కాన్సెప్ట్ ఇయేషన్ ఎగ్జిక్యూటెడ్ బై: అరవింద్ బాబు యాదవ్ రాగం. సైట్ అసిస్టెడ్: పోష్ శెట్టి, అజెందర్రావు, సత్యం గౌడ్. మలయ్య ఆరేళ్ళుగా ఇండియాకి వెళ్ళలేకపోతున్నాడు. కుమార్తె వివాహానికి కూడా హాజరు కాలేకపోయాడు మల్లయ్య. ఆయన కుమారుడి చదువు కోసమే ఆయన శ్రమిస్తున్నాడు. అతనికి తమవంతు సాయంగా ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.


తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







