చికాగో విమానాశ్రయం లో తెలుగు విద్యార్థులను నిలిపివేశారు
- December 27, 2015
, by Maagulf
అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చికాగోలోని ఎయిర్‌పోర్టులో తెలుగు విద్యార్థులను సోమవారం అక్కడి అధికారులు నిలిపివేశారు. మిషిగన్‌లోని ఓ వర్సిటీ విద్యార్థులను కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కిపంపారు. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే రెండు వర్సిటీల విద్యార్థులు వెనక్కి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇమ్మిగ్రేషన్, ఎఫ్‌బీఐ అధికారుల తీరుతోనే విద్యార్థులకు ఈ సమస్యలు తెచ్చిపెడుతున్నాయని వారు వాపోతున్నారు. ఏదో ఒక సాకుతో విద్యార్థులను యూఎస్ అధికారులు వెనక్కిపంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.