అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్ధులకు విముక్తి
- February 13, 2019
అమెరికాలో నకిలీ వీసాల కేసులో…. అరెస్టైన తెలుగు విద్యార్ధుల విముక్తి లబిస్తోంది. కోర్టు విచారణ తర్వాత ఒక్కొక్కరుగా స్వదేశం తిరిగి వచ్చేందుకు వీలు కలుగుతోంది. డౌన్టౌన్ డెట్రాయిట్ కోర్టులో విచారణ జరిగింది. అక్కడి జైళ్లలో ఉన్న 20 మందిలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులకు విముక్తి లభించింది. మిగిలిన 17 మందిలో 15 మంది ఫిబ్రవరి 26 లోపు అమెరికా నుంచి ఇండియా వెళ్లిపోయేందుకు కోర్టు అనుమతిచ్చింది. కోర్టు నుంచి తుది ఆదేశాలు రాగానే… వారంతా ఇండియాకు రానున్నారు. ఇవాళ కోర్టు హాజరైనా ఈ 17 మంది విద్యార్ధుల్లో 8 మంది మిన్రో డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. మరో 9 మంది కల్హౌన్ కౌంటిలో 9 మంది విద్యార్ధులున్నారు. మొత్తం ఈ 17 మందిలో 15 మందికి విముక్తి లభించినట్లైంది॥ ఏడుగురు స్వచ్చంద నిష్క్రమణకు అంగీకరించారు. మరో విద్యార్ధు బహిష్కరించారు. మరో విద్యార్ధి కేసు విచారణ జరుగుతోంది. అయితే..అతని స్వచ్ఛంద నిష్కమణించే అవకాశం ఉంది.
మిషిగాన్ డిటెన్షన్ సెంటర్లో ముగ్గురు విద్యార్ధులు విడుదలయ్యారని అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇవాళ మరో 18 మం దికి బెయిల్ దొరికే అవకాశం ఉంది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ బృందం అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిసా స్లాట్‌ను కలిసింది. విచారణను వేగవంతం చేసి విద్యార్థులకు విముక్తి లభించేలా చూడాలని కోరింది. దీంతో ఎలిసా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యార్థుల విముక్తికి కృషిచేశారు. విద్యార్థుల విడుదలకు అటార్నీ రాండీ సమోన కృషిచేస్తున్నారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







