సినీ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
- February 13, 2019
ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీదేవి ఈరోజు హైదరాబాద్ లో కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
సాయంత్రం జయశ్రీదేవి మృతదేహాన్ని బెంగులూరుకి తరలించనున్నారు. శ్రీమంజునాథ, వందేమాతరం, చంద్రవంశం వంటి చిత్రాలకు జయశ్రీదేవి నిర్మాతగా వ్యవహరించారు. ఆమె మరణవార్త తెలిసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇటీవల జయశ్రీకి చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం ఆరు నెలల పాటు శిక్షను విధించింది. 2005లో అశ్విని పిక్చర్స్ ఓనర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన ఆనంద్ నుండి రూ.17.40 లక్షలను ఆమె అప్పుగా తీసుకున్నారు. డబ్బు తిరిగిచ్చే సమయంలో ఆమె ఆనంద్ కు చెక్ ఇచ్చారు కానీ అది బౌన్స్ అవ్వడంతో ఆమెకి ఆరు నెలల జైలు శిక్ష పడింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!