షార్జాలో రోడ్డు ప్రమాదం: భారతీయ జంట మృతి
- February 13, 2019
షార్జాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో భారతీయ జంట ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో 9 ఏళ్ళ చిన్నారి కూడా వుంది. అతి వేగంతో దూసుకెళ్ళిన ఎస్‌యూవీని అదుపు చేయడంలో డ్రైవర్ విఫలమవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నజ్వా నుంచి షార్జా వైపు వస్తుండగా ప్రమాదానికి గురైన ఎస్‌యూవీ పలుమార్లు రోడ్డుపై పల్టీలు కొట్టింది. సమాచారం అందుకోగానే ట్రాఫిక్ అధికారుల టీమ్, పెట్రోల్ వెహికిల్స్, రెస్క్యూ అంబులెన్స్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మృతుల్ని అల్ ధయిద్ ఆసుపత్రికి తరలించగా, గాయపడ్డవారిని అల్ కాసిమి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మృతులు విజిట్ వీసాపై ఇండియా నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్