పట్టాలెక్కిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌..

- February 15, 2019 , by Maagulf
పట్టాలెక్కిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌..

న్యూఢిల్లీ:దేశంలో తొలి అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రధాని మోది జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, ఇతర సభ్యులు రైలులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి వారణాసికి 9 గంటల 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. వందేభారత్‌ వెళ్లే మార్గాలైన కాన్పూర్‌, అలహాబాద్‌ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక క్యార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్టేషన్లలో 40 నిమిషాల పాటు రైలు ఆగనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 16 ఏసి భోగీలను కలిగిఉంది. ఈ రైలులో 1128 సీట్లున్నాయి. ఆటోమేటిక్‌ డోర్‌ సిస్టమ్స్‌, వైఫై, బయోవాక్యూమ్‌ టా§్‌ులెట్లుతో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com