వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు

- February 16, 2019 , by Maagulf
వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు

ప్రతిష్టాత్మకమైన వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. అత్యంత వేగంగా వెళ్లే ఈ రైలు రెండ‌వ రోజే సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఈ ఉద‌యం వార‌ణాసి నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తుండ్లా స్టేష‌న్ వ‌ద్ద ఆగిపోయింది. ఓ ఆవును ఢీకొనడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. తుండ్లా స్టేష‌న్ వ‌ద్ద సుమారు 3 గంట‌ల పాటు రైలును ఆపేశారు.

ఢిల్లీ నుంచి వార‌ణాసి వెళ్తున్న స‌మ‌యంలో ఆ రైలు గంట‌కు 130 కిలోమీట‌ర్ల టాప్ స్పీడ్ వేగంతో వెళ్లింది. అయితే ఇవాళ సాంకేతిక లోపం త‌లెత్తడంతో.. ఆ రైలును కేవ‌లం 40 కిలోమీట‌ర్ల వేగంతో తీసుకువెళ్లారు. ఢిల్లీకి 200 కిలోమీట‌ర్ల దూరంలో అది నిలిచిపోయింది. నిన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైలు ప్రారంభించిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com