అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి!
- February 16, 2019
షికాగో: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరవకముందే చోటుచేసుకుంటున్న మరో ఘటన అమెరికన్స్తో పాటు అక్కడకు వలస వెళ్లిన విదేశీయులను వణికిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఇలినాయిస్ రాష్ట్రంలోని షికాగకు 80 కిమీ దూరంలో వున్న ఆరోరా నగరంలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లో ఓ దుండగుడు హ్యాండ్ గన్తో జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా పలువురు గాయపడ్డారని ఆరోరా పోలీస్ చీఫ్ క్రిస్టెన్ జిమాన్ తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. అంతకన్నా ముందుగా పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు దుండగుడు వారిపైకి కాల్పులు జరపగా ఈ కాల్పుల్లో మరో ఐదుగురు పోలీసులు గాయపడినట్టు తెలుస్తోంది. పోలీసుల కాల్పుల్లో గాయపడిన దుండగుడిని గ్యారీ మార్టిన్గా గుర్తించారు.
హెన్రీ ప్రాట్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకోగా... అదే కంపెనీలో పని చేసే ఉద్యోగి గ్యారీ మార్ట్ సహోద్యోగులపైనే తుపాకీతో దాడికి పాల్పడినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







