నిరుద్యోగులకు తీపికబురు..
- February 17, 2019
నిరుద్యోగ యువతకి తీపి కబురు అందించింది దక్షిణ మధ్య రైల్వే. 12 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 12,433 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)లు ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. తాజాగా రైల్వేమంత్రి పియూష్ గోయల్ 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెలలో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







