అమెజాన్‌లో ఉద్యోగాలు.. ఈ భాషలు తెలిసుంటే..
- February 19, 2019
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలు, పీజీల కంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మాతృభాషతో పాటు మరిన్ని భాషలు అనర్గళంగా మాట్లేడేవారికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. అందుకోసం కొన్ని ఇనిస్టిట్యూట్‌లు ప్రత్యేకంగా విదేశీ భాషలు నేర్పిస్తున్నాయి. అవే అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి.
ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న సంస్థ.. అమెజాన్‌లో ‘డిజిటల్ కంటెంట్ అసోసియేట్’ పోస్టులకు విదేశీ భాషలు ముఖ్యంగా జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన వారిని తీసుకుంటోంది. ఆయా భాషలు నేర్పించే సంస్థలను సంప్రదించి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటూ పిలుపునిస్తోంది.
అడ్వాన్స్ జపనీస్ లెవెల్ (JLPT N3/N2) కోర్సులు పూర్తి చేసిన జపనీస్ లాంగ్వేజ్ విద్యార్థుల కోసం హయకవ జపనీస్ లాంగ్వేజ్ స్కూల్లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది అమెజాన్. వీరికి జీతాలు కూడా భారీగానే ప్రకటించింది. సీనియర్ లెవెల్ పోస్టుకు వార్షిక వేతనం రూ.5 లక్షలకు పైగా, జూనియర్ లెవెల్ పోస్టులకు వార్షిక వేతనం రూ.2.6 లక్షల నుంచి రూ.3.6 లక్షల వరకు ఆఫర్ చేస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..